డాక్టర్ల బదిలీలు పారదర్శకంగా జరగాలి

డాక్టర్ల బదిలీలు పారదర్శకంగా జరగాలి
  • డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ టీచింగ్ హాస్పిటల్స్‌ డాక్టర్స్ జేఏసీ

బషీర్ బాగ్, వెలుగు: ప్రభుత్వ డాక్టర్ల బదిలీ తర్వాతే పదోన్నతులు చేపట్టాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ టీచింగ్ హాస్పిటల్స్‌ డాక్టర్స్ జేఏసీ డిమాండ్‌ చేసింది. మంగళవారం కోఠి మెడికల్ కాలేజీ ఆవరణలో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాల మెడికల్​కాలేజీల డాక్టర్లు పాల్గొన్నారు. టీచింగ్​హాస్పిటల్స్ నూతన డైరెక్టర్ డాక్టర్ల జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డాక్టర్​సంఘాల ఒత్తిడి లేకుండా బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. 

జేఏసీ చైర్మన్ డా.వి.శేఖర్, కన్వీనర్లు చంద్రశేఖర్, నాగరాజు, సాంబశివారెడ్డి, జగతి, హేమలత, అమరావతి, కో-కన్వీనర్లు సూర్యనారాయణ, బెంజ్ మెన్, మనీష్ గుప్తా, అరుణ, నీలవేణి, శిరోమణి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా, గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ల ముసుగులో ఐదేండ్లుగా కొనసాగుతున్నారని చెప్పారు.