- ట్రాన్స్‌జెండర్ సవరణ బిల్లు సరికాదు
- మోదీ ప్రభుత్వ తీరు సిగ్గుచేటు..
- ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఆగ్రహం
పంజాగుట్ట, వెలుగు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టాన్స్‌జెండర్ అమెండ్మెంట్యాక్ట్ను తాము వ్యతిరేకిస్తున్నామని ట్రాన్స్జెండర్కమ్యూనిటీ స్పష్టం చేసింది. తమను మానసిక వేదనకు గురి చేసేందుకు చట్టానికి సవరణలు చేశారని ఆరోపించింది. మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ట్రాన్స్‌జెండర్2026 చట్టం తిరస్కరణ’ అన్న అంశంపై ట్రాన్స్జెండర్కమ్యూనిటీ ప్రతినిధి చంద్రముఖి మువ్వల మాట్లాడుతూ చట్ట సవరణలో భాగంగా సెల్ఫ్ఐడెంటిఫికేషన్ను తొలగించడం, డాక్టర్సర్టిఫికెట్తప్పనిసరి చేయడం సరికాదన్నారు.
ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. తమకు అన్ని వేళలా అండగా నిలిచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ సమస్య పై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్ జెండర్ ప్రతినిధులు ప్రచీల్రాథోడ్, మధుశాలిని, న్యాయవాది కిరణ్ రాజ్, సుశ్మిత, శ్రేయ పాల్గొన్నారు. తర్వాత ప్రెస్‌క్లబ్ నుంచి నెక్లెస్ రోడ్డులోని డా. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు.
