ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్.. ఎవరీమే?

ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్.. ఎవరీమే?

అఖిల భారత హిందూ మహాసభ (ABHM) అభ్యర్థి కిన్నార్ మహామండలేశ్వర్ హిమాంగి సఖీ 2024 లోక్‌సభ ఎన్నికలలో వారణాసి స్థానం నుండి ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని  ఆ పార్టీ అధినేత స్వామి చక్రపాణి  తెలిపారు.  బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ కావడం విశేషం. 

2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్‌గా పట్టాభిషిక్తులయ్యారు.  ఈమె శ్రీకృష్ణునికి భక్తురాలు.  ప్రపంచవ్యాప్తంగా అనేక భగవత్ కథలు, రామ్ కథలు, దేవి భగవత్ కథలు రాశారు కూడా.  మహామండలేశ్వర్ కిన్నార్ హిమాంగి సఖీతో పాటు, లక్నో, ఘజియాబాద్, ఆగ్రా, ఫతేపూర్, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్‌లో అభ్యర్థులను అఖిల భారత హిందూ మహాసభ  ప్రకటించింది.

మోదీపై కాంగ్రెస్ పార్టీ నుంచి అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు.  వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో 19.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 10.65 లక్షల మంది పురుషులు 8.97 లక్షల మంది మహిళ ఓటర్లు ఉన్నారు.  ఇక 135 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది వారణాసి లోక్‌సభ స్థానం నుంచి 52,174 మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు.