మరో ట్రాన్స్ జండర్ మృతి.. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి

మరో ట్రాన్స్ జండర్ మృతి.. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి

జూబ్లీహిల్స్, వెలుగు: తమ లీడర్​ మోనాలిసా వేధింపులు భరించలేక ఈ నెల 17న బోరబండలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ట్రాన్స్ జెండర్లలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా.. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న నవనీత(24) మంగళవారం మృతిచెందారు. ఆమె డెడ్​బాడీని స్వస్థలమైన కర్నాటకకు తరలించారు. పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లడంతో అప్రమత్తమైన బోరబండ ఎస్సై కాశన్న, పోలీస్ సిబ్బంది కర్నాటకకు వెళ్లారు.

జైలులో ఉన్నా బెదిరింపులు ఆగట్లే..

ట్రాన్స్​జెండర్ల లీడర్​గా కొనసాగుతున్న మోనాలిసా పలు నేరాలకు పాల్పడి  జైలుకు వెళ్లినా వేధింపులు తమపై వేధింపులు ఆగడం లేదని బాధిత ట్రాన్స్ జెండర్ లు తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మాట్లాడారు. 

కిడ్నాప్​లు, దొంగతనం, హత్యాయత్నం, దారి దోపిడి వంటి కేసుల్లో మోనాలిసా జైలుకు వెళ్లారని చెప్పారు. ఆమె అక్కడి  నుంచే తన అనుచరుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరు రోజుకు రూ.1500 ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు  చెప్పారు.