తెలుగులోనూ సుప్రీంకోర్టు తీర్పులు

తెలుగులోనూ సుప్రీంకోర్టు తీర్పులు

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పులు ఇకపై ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. సుప్రీంకోర్టు 100 కీలక తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా విడుదల చేశారు.

సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయాన్ని రాష్ట్రపతి బుధవారం ప్రారంభించారు. 12 ఎకరాల్లో 6 బ్లాకులుగా అదనపు భవనాల నిర్మాణం జరిగింది. హిందీతో పాటు మరో 5 ప్రాంతీయ భాషలు తెలుగు, అస్సామీ, కన్నడ, మరాఠీ, ఒరియా ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువడనున్నాయి.