
చెన్నై: పొంగల్ పండుగకు ముందు తమిళనాడు ట్రాన్స్ పోర్ట్ వర్కర్లు నిరవధిక సమ్మెకు దిగారు. మంగళవారం ఆందోళనలు చేపట్టారు. పెన్షనర్లకు కరువు భత్యం, పాత పెన్షన్ స్కీమ్ సహా 6 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరించడంతో పాటు 15వ వేతన కమిషన్కు సంబంధించిన చర్చలు ప్రారంభించాలని కోరారు. డీఎంకేకు అనుబంధ ట్రాన్స్పోర్ట్ యూనియన్లు తప్ప అన్ని సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే, సమ్మె ప్రభావం ప్రజలపై ఏ మాత్రంలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో 95% బస్సులు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు చెప్పారు. వర్కర్ల సమ్మెపై మంత్రి శివ శంకర్ స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక డిమాండ్లను నెరవేరుస్తామని తెలిపారు.