డబ్ల్యూటీసీ ఫైనల్‌.. సెంచరీ చేసిన హెడ్ 

డబ్ల్యూటీసీ ఫైనల్‌.. సెంచరీ చేసిన హెడ్ 

లండన్‌లోని ఓవల్‌లో జరుగుతోన్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్ లో   ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ (105*) సెంచరీ చేశారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసినహెడ్ 106 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు.  హెడ్ ఇన్నింగ్స్ లో15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.   మరోవైపు స్టీవ్ స్మిత్ (71*) పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 69 ఓవర్లకు గానూ మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.  

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్‌ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (0)ను సిరాజ్‌ వెనక్కి పంపాడు. ఆ తరువాత దూకుడుగా ఆడుతున్న డేవిడ్ వార్నర్ (43) శార్దూల్ ఠాకూర్‌ వేసిన 21.4 ఓవర్‌కు వికెట్ కీపర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.. లంచ్‌కు ముందు వార్నర్ వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియాకు..  లంచ్ తరువాత మరో షాక్‌ తగిలింది. లంచ్‌ నుంచి వచ్చి రాగానే మార్నస్‌ లబుషేన్‌ (26)ను షమీ బౌల్డ్‌ చేశాడు.