మెల్బోర్న్:పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోక విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (83 బంతుల్లోనే 123) సెంచరీతో చెలరేగి జట్టుకు వేగంగా గెలుపును అందించాడు.
ఈ విజయం ద్వారా టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 పరుగులకు పైగా రన్-ఛేజింగ్ చేసిన జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంగ్లాండ్ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలో 7.23 ఓవర్-రన్ రేటుతో లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా. ఇప్పటి వరకు ఈ రికార్డు (రన్ రేట్ పరంగా) ఇంగ్లాండ్ పేరిట ఉండేది. న్యూజిలాండ్‌పై 50 ఓవర్లలో 5.98 రన్ రేట్‌తో 299 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసింది ఇంగ్లాండ్.
టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన 200+ ఛేజింగ్ (రన్ రేట్ పరంగా):
- 2025లో ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ 7.23
- 2022లో ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ 5.98
- 1994లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ 5.77
