కొత్త డ్యాన్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తమన్నా

V6 Velugu Posted on Jan 29, 2022

బాహుబలి హీరోయిన్ తమన్నా శుక్రవారం ఓ కొత్త డ్యాన్స్ ఛాలెంజ్ ప్రారంభించింది. తాజాగా ఆమె నటించిన ‘గని’ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేసి.. తనలాగే డ్యాన్స్ చేయాలంటూ సవాల్ చేసింది. అయితే ముందుగా ఈ చాలెంజ్‏ను ‘గని’ సినిమా హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్‎లకు విసిరింది. 

‘మరిన్ని అవకాశాలను తీసుకోండి. మరిన్ని డ్యాన్స్‌లు చేయండి. నేను ‘కొడ్తే బీట్‌కి డ్యాన్స్ చేస్తున్నాను. ఇక మీ వంతు! #KodtheDanceChallengeని స్వీకరించమని మీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నాను’ అని క్యాప్షన్ పెట్టింది. 

దీనికంటే ముందు తమన్నా.. కొడ్తే పాట విడుదల సమయంలో ఓ పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘మీ లక్ష్యాలను సాధించడానికి, మిమ్మల్ని ప్రేరేపించడానికి కోడ్తేని పోస్ట్ చేస్తున్నాను. నాకౌట్ కావడానికి సిద్ధంగా ఉండండి’ అని తన ఇన్‎స్టాలో పోస్ట్ చేసింది.

తమన్నా..  మంచు మనోజ్ హీరోగా 2005లో వచ్చిన ‘శ్రీ’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడగుపెట్టింది. ఆ తర్వాత..  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో  బాగా పాపులర్ అయింది. ఆ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సీనియర్ నటులతో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమన్నా తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తోంది.  ఈ మిల్కీ బ్యూటీ తాజాగా గోపిచంద్ నటించిన సీటీమార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

For More News..

‘నాలో నేను’ సినిమాను బ్యాన్ చేయాలె

మార్కెటింగ్ ఉద్యోగులపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్

 

Tagged trending, Tamannaah, Baahubali, Ghani, Dance Challenge, varuntej konidela, Sai Manjrekar, kodthe dance challenge

Latest Videos

Subscribe Now

More News