న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని గందర్ బాల్ జిల్లా గగాంగిర్ వద్ద టెర్రరిస్టులు జరిపిన కాల్పులు తమ పనేనని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) ప్రకటించింది. ఈ కాల్పుల్లో మొత్తం ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఒక డాక్టర్, ఆరుగురు వలస కార్మికులు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆదివారం గుండ్ ప్రాంతంలో సొరంగాన్ని నిర్మించే పనిలో కార్మికులు ఉండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ అటాక్లో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. టెర్రరిస్టులను గుర్తించేందుకు పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు.
Also Read :- దానా తుఫాన్ దూసుకొస్తోంది..
ఈ కాల్పుల వెనుక టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జద్ గల్ కీలక సూత్రధారి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కశ్మీర్లో కాశ్మీరీ పండిట్స్ను ఈ ఉగ్రవాద సంస్థ టార్గెట్ చేస్తుంటుంది. గతంలో కొందరు కాశ్మీరీ పండిట్స్ను ఈ ఉగ్రవాద సంస్థ పొట్టనపెట్టుకుంది.