
కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ డ్రాగన్ బోట్ ఛాంపియన్ షిప్పోటీలకు ఎంపికయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో చదువుతున్న స్రవంతి, సంజయ్నాయక్, ప్రభాకర్ఫిలిప్పీన్స్లో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు జరిగే అంతర్జాతీయ జూనియర్ డ్రాగన్బోట్పోటీల్లో పాల్గొననున్నారు. సోమవారం ఫిలిప్పీన్స్కు బయలుదేరి వెళ్లిన ఈ ముగ్గురికి హైదరాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్. కొటాజి, హాస్టల్ వెల్ఫైర్ ఆఫీసర్ నీలిమ, టీచర్లు శుభాకాంక్షలు తెలిపారు.