
జైనూర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో మారుగోళ్ల (బొంగు గుర్రం) సందడి ప్రారంభమైంది. శ్రావణమాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ గ్రామాల్లో శుక్రవారం ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా యువకులు, పిల్లలు... ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రెండు కర్రలపై నిలబడి నడుస్తారు.
నెల రోజుల పాటు పొలాల అమావాస్య వరకు ఇలాగే నడక కొనసాగిస్తారు. వానాకాలం అటవీ ప్రాంతాల్లో బురద ఎక్కువ. రోడ్లపై కాళ్లతో నడిస్తే చర్మ సమస్యలు వస్తాయని, అవి రాకుండా ఉండేందుకే ఈ గోనెగాళ్లతో నడుస్తామని గిరిజనులు చెప్తున్నారు.