కార్గిల్ విజయ్ దివస్: యుద్ధవీరులకు నివాళి

కార్గిల్ విజయ్ దివస్: యుద్ధవీరులకు నివాళి

దేశ వ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి వార్ మెమోరియల్ వద్ద కవాతునిర్వహించారు జవాన్లు.

జమ్ము కశ్మీర్ లోని ద్రాస్ వార్ మెమోరియల్ వద్ద ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఎయిర్, చీఫ్ మార్షల్ బిరేందర్ సింగ్ దనోవా, నావీ చీఫ్ అడ్మినరల్ కరమ్ బీర్ సింగ్ లు కార్గిల్ వీరులకు  నివాళులు అర్పించారు. అమర జవాన్ల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. రావత్ మాట్లాడుతూ.. కార్గిల్ యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన వీరులను భరతజాతి ఎప్పటికి గుర్తుంచుకుంటుందని అన్నారు. దేశ రక్షణ కోసం భాతర దళాలు ప్రతీక్షణం రెడీగా ఉంటాయని చెప్పారు.