
పంజాగుట్ట, వెలుగు : నిమ్స్ హాస్పిటల్‌లోని పలువురు ఉద్యోగులు శుక్రవారం పదవీ విరమణ పొందారు. వారిని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ఘనంగా సన్మానించారు. హాస్పిటల్లెర్నింగ్సెంటర్లో జరిగిన కార్యక్రమంలో బీరప్ప మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు రిటైర్ అయ్యి వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు.
పదవీ విరమణ పొందిన వారిలో ఫైనాన్స్కంట్రోలర్శ్రీధర్, ల్యాబ్అసిస్టెంట్ గిరిధర్, ఏసీ మెకానిక్ నాగేశ్వరరావు, సీనియర్ రేడియోగ్రాఫర్తిరుపతిరావు, స్టాఫ్‌నర్సు తిరుపతమ్మ, ఫార్మాసిస్టు ఉషారాణి ఉన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డా.శాంతివీర్, డాక్టర్ ఉష, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.