
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో వీర బాలలకు మంగళవారం నివాళులు అర్పించారు. గురు గోవింద్సింగ్కుమారులైన జొరావత్ సింగ్, ఫతే సింగ్‌ల బలిదానం డిసెంబర్26న సుమారు 500 సంవత్సరాల కిందట జరిగింది. దీన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని పిలుపు మేరకు వీర బాలల దినోత్సవం చేపట్టామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు టి. సదానంద్రెడ్డి అన్నారు.
జొరావత్ సింగ్, ఫతేసింగ్‌ల బలిదానం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ టి. శ్రీదేవి, పట్టణ కార్యదర్శి రఘు, పేట నారాయణరెడ్డి, సాయిబాబా మందిర పూజారి పూరన్సింగ్, మల్లేశ్ పటేల్, బస్వాలింగం, సతీశ్, కిరణ్, సుధాకర్, లక్ష్మారెడ్డి, ప్రశాంత్, మాధూరి, మాధవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.