దైవం, అతీత శక్తుల మధ్య త్రికాల

దైవం, అతీత శక్తుల మధ్య త్రికాల

శ్రద్ధా దాస్ లీడ్ రోల్‌‌లో నటించిన చిత్రం ‘త్రికాల’. మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని కీలక పాత్రలు పోషించారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక, శ్రీనివాస్ నిర్మించారు.  చాగంటి ప్రొడక్షన్ ఎల్‌‌ఎల్‌‌పీ ద్వారా  మే 28న సినిమా విడుదల కానుంది. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌‌, పాటలు, ప్రమోషనల్ కంటెంట్  సినిమాపై ఆసక్తిని పెంచాయి.  ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్‌‌ మైథలాజికల్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కించాం.

శ్రద్ధా దాస్ కొత్త లుక్‌‌, మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌‌లు, అజయ్ పవర్‌‌ఫుల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. అలాగే అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్‌‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన  బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్  ఆకట్టుకుంటాయి.  ఇప్పటికే ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగింది. హిందీ శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి’  అని చెప్పారు.