లోక్సభ భద్రతా వైఫల్యంపై ఆందోళనలు.. టీఎంసీ ఎంపీ ఓబ్రియెన్‌పై సస్పెన్షన్ వేటు

లోక్సభ భద్రతా వైఫల్యంపై ఆందోళనలు.. టీఎంసీ ఎంపీ ఓబ్రియెన్‌పై సస్పెన్షన్ వేటు

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌పై రాజ్యసభలో సస్సెన్షన్ వేటు పడింది. గురువారం నుంచి శీతాకాల సెషన్‌ ముగిసేవరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్ ప్రకటించారు. రాజ్యసభ నిబంధనలు ఉల్లంఘించారని, వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారని, క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడంతో ఆయనను సస్పెండ్ చేశామని జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పారు.

బుధవారం (డిసెంబర్ 13న) మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకడంతో సభలో తీవ్ర అలజడి చెలరేగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై చర్చ జరగాలని గురువారం (డిసెంబర్ 14న) సభలో ఓబ్రియెన్‌ డిమాండ్ చేశారు. 

సభలో ఆందోళన చేయడంతో ఆయనపై ధన్‌ఖడ్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో డెరిక్ ఓబ్రియన్ ను సభ నుంచి సస్పెండ్ చేశారు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్. ఈ సెషన్ మొత్తం ఆయనపై వేటు కొనసాగనుంది. రాజ్యసభ చైర్మన్ ప్రకటనను విపక్ష సభ్యులు వ్యతిరేకించారు.