
బెంగాలీ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుతూ, ఓవర్‌నైట్ రాజకీయాల్లోకి వచ్చి టీఎంసీ తరఫున ఎంపీలుగా గెలిచిన మిమి చక్రవర్తి (జాదవ్‌పూర్) నుస్రత్ జహాన్ (బసిర్హత్) తీరుపై ట్రోలర్లు దుమ్మెత్తిపోశారు. కొత్త ఎంపీలుగా సొమవారం ఐడీ కార్డులు తీసుకున్న ఆ ఇద్దరూ పార్లమెంట్ బిల్డింగ్ ముందు నిలబడి ఇలా ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజాస్వామిక దేవాలయంలాంటి పార్లమెంట్‌కు ఇలాంటి డ్రెస్సుల్లో రావడమేంటని నెటిజన్లు మండిపడ్డారు. పేజ్3 పార్టీలకు వేసుకెళ్లే డ్రెస్‌తో పార్లమెంట్‌కి వెళతారా అంటూ ట్రోలింగ్‌కు దిగారు. ఈ వివాదంపై ఎంపీలిద్దరూ మౌనంగా ఉండిపోయారు.