ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీలు ప్రధాని మోడీ స్వంత ఆస్తులు కావన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోడీ మాత్రం త్రివిధదళాలను తన వ్యక్తిగత ఆస్తులుగా భావిస్తున్నారని విమర్శించారు. ఇవాళ(శనివారం) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. UPA పాలన సమయంలో సర్జికల్ దాడులు చేశామంటే, అవి వీడియోగేమ్ లో జరిగాయని మోడీ ఆర్మీని కించపరిచారన్నారు రాహుల్. ఇప్పుడు నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగుల గురించి , రైతుల గురించి మోడీ ఏం మాట్లాడడం లేదన్నారు. మసూద్ అజర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్న రాహుల్… అతన్ని ఎవరు విడిచి పెట్టారని ప్రశ్నించారు.
