షూటర్ ధనుష్​ శ్రీకాంత్​కు ఘన స్వాగతం

షూటర్ ధనుష్​ శ్రీకాంత్​కు ఘన స్వాగతం

శంషాబాద్, వెలుగు : వరల్డ్ డెఫ్‌‌‌‌‌‌‌‌ షూటింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన సిటీ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌కు ఘన స్వాగతం లభించింది. జర్మనీలోని హనోవెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ టోర్నీలో సత్తా చాటిన శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ సోమవారం సిటీకి తిరిగొచ్చాడు. శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో కుటుంబ సభ్యులు, శ్రీకాంత్​శిక్షణ పొందుతున్న గన్‌‌‌‌‌‌‌‌ ఫర్ గ్లోరీ అకాడమీ కోచ్‌‌‌‌‌‌‌‌లు, స్టూడెంట్లు ఘన స్వాగతం పలికారు.

ధనుష్‌‌‌‌‌‌‌‌ను చూడగానే అతని తల్లి ఆశ శ్రీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. కొడుకును హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ధనుష్ ఒక పతకం నెగ్గుతాడని అనుకుంటే ఏకంగా మూడు స్వర్ణాలు సాధించడంతో తామెంతో గర్వపడుతున్నామని చెప్పారు. వైకల్యంతో కుంగిపోకుండా ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన ధనుష్ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం లభిస్తుందని ఆశిస్తున్నామని కోచ్‌‌‌‌‌‌‌‌ నిరంజన్ రెడ్డి అన్నారు. 

Also Read : ఇంగ్లండ్‎పై శ్రీలంక విజయం