ట్రిపుల్ ఐటీ సెలక్షన్ లిస్టు విడుదల

ట్రిపుల్ ఐటీ సెలక్షన్ లిస్టు విడుదల

బాసర, వెలుగు: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్  నాలెడ్జ్  టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ) బాసర, మహబూబ్‌నగర్  క్యాంపస్‌లలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్  బీటెక్  ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను శనివారం వీసీ గోవర్ధన్  రిలీజ్​ చేశారు. 

ఎంపికైన విద్యార్థులకు జూన్ 5,6,8 తేదీల్లో సర్టిపికెట్ల వెరిఫికేషన్​ ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్​సైట్​లో సంప్రదించాలని సూచించారు.