టాలీవుడ్ మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్(Animal) సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి డిమ్రి (Triptii Dimri) వరుస ఇంటర్వూస్తో బిజీగా ఉంది.
లేటెస్ట్గా త్రిప్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. సౌత్లో ఎవరితో నటించాలని ఉందని అడగగా..జూనియర్ ఎన్టీఆర్ అంటూ సమాధానమిచ్చింది. ఎన్టీఆర్(NTR)తో నటించాలని ఉన్న..త్రిప్తి ఆశలను తీర్చడానికి..మరి ఏ డైరెక్టర్ అవకాశం ఇస్తాడో చూడాలి.
ఇక ‘యానిమల్’ గురించి మాట్లాడుతూ..ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా నటనకు ప్రశంసలు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ త్రిప్తి డిమ్రి వీడియోను షేర్ చేస్తున్నారు
Tripti Dimri - Jr NTR Combo Will Soon Happen ✅pic.twitter.com/KhodN5GLIN
— Analyst (@BoAnalyst) December 12, 2023
ఇదిలా ఉంటే..యానిమల్ మూవీలో చేసింది చిన్న పాత్రలో అయినా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. ఒక్క యానిమల్ హిట్ తో త్రిప్తి ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 36లక్షలకు చేరింది.ఇపుడు యానిమల్‌తో యూత్ సెన్సేషన్‌గా త్రిప్తి డిమ్రి మారిపోయింది. ఇక త్రిప్తి సినిమాల విషయానికి వస్తే..శ్రీదేవి మామ్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా..యానిమల్ కంటే ముందు లైలా మజ్ను, ఖాలా, బుల్‌బుల్ సినిమాలు చేసింది. టాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టడం మాత్రం కన్ఫమ్.
