స్పిరిట్‌‌‌‌ షూట్‌‌‌‌ కు త్రిప్తి డిమ్రీ రెడీ.. మే 23 నుంచి కొత్త షెడ్యూల్..

స్పిరిట్‌‌‌‌ షూట్‌‌‌‌ కు త్రిప్తి డిమ్రీ రెడీ.. మే 23 నుంచి కొత్త షెడ్యూల్..

‘యానిమల్’ సినిమాతో ఓవర్‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌గా మారిన త్రిప్తి డిమ్రీ.. ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌‌‌లో మరోసారి నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌‌‌‌ హీరోగా  సందీప్ తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్‌‌‌‌’ చిత్రంలో ఆమె హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఇంటెన్స్‌‌‌‌ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే ఇంతవరకూ హీరోయిన్‌‌‌‌ త్రిప్తి డిమ్రి షూట్‌‌‌‌లో జాయిన్ అవలేదు. ఈ నెల 23 నుంచి కొత్త షెడ్యూల్‌‌‌‌ స్టార్ట్ కానుంది. 

ఈ షెడ్యూల్‌‌‌‌లో ప్రభాస్‌‌‌‌తో పాటు త్రిప్తి కూడా పాల్గొనబోతోందని తాజా సమాచారం. వీళ్లిద్దరి కాంబినేషన్‌‌‌‌లో రొమాంటిక్‌‌‌‌ సీన్స్‌‌‌‌ చిత్రీకరించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు.  మల్టిపుల్ షేడ్స్‌‌‌‌ ఉండే పాత్రలో త్రిప్తి కనిపించనుందట. జూన్‌‌‌‌ ఫస్ట్ వీక్ వరకు ఈ షెడ్యూల్‌‌‌‌ కొనసాగనుందని తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్‌‌‌‌ విలన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. టీ సిరీస్‌‌‌‌తో కలిసి సందీప్‌‌‌‌ రెడ్డి నిర్మిస్తున్నారు. వ‌‌‌‌చ్చే ఏడాది మార్చి 5న సినిమా రిలీజ్ కానుంది.