
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేశామని చెబుతూ, బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరుతూ ఇంటింటికీ తిరుగారు. ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మాణిక్ సాహా చెప్పారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సమీర్ రంజన్ బర్మన్ ఇంటికి కూడా వెళ్లారు.
ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న క్లీన్ ఇమేజ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని మాణిక్ సాహా అభిప్రాయపడ్డారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లకు పైగా గెలిచి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం)-, కాంగ్రెస్ కూటమిని అపవిత్ర కలయికన్న మాణిక్ సహా... ప్రజలు వారిని తప్పకుండా తిరస్కరిస్తారన్నారు. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఇక్కడ 28,13,478 మంది ఓటర్లు ఉన్నారు.