వెరీ టూమచ్ : ఏసుక్రీస్తు రూపంలో సరస్వతిదేవి విగ్రహం..

వెరీ టూమచ్ : ఏసుక్రీస్తు రూపంలో సరస్వతిదేవి విగ్రహం..

హిందూ దేవుళ్లు, దేవతలకు ఓ రూపం ఉంటుంది.. జనం గుండెల్లో ఓ ఆకారం ఉంటుంది.. హిందూ దేవుళ్లకే అని కాదు.. మిగతా మతాల్లోని దేవుళ్లకు ఓ రూపం, ఆకారం ఉంటుంది. అలాంటిది త్రిపురలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ గవర్నమెంట్ కాలేజ్ లో  ఏర్పాటు చేసిన సరస్వతిదేవి విగ్రహ రూపం.. ఏసుక్రీస్తును పోలి ఉందనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఆ విగ్రహం చూసిన వారు ఇదే మాట అనటంతో.. దీనిపై త్రిపురలో వివాదం చెలరేగింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించటం.. విచారణకు ఆదేశించటం చకచకా జరిగిపోయాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

 త్రిపుర రాష్ట్రంలోని అగర్తల టౌన్ లిచ్చుబగన్‌లో ఉన్న త్రిపుర ప్రభుత్వ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాలేజ్ లో బుధవారం (ఫిబ్రవరి14)న  వసంత పంచమి కావున సరస్వతి మాత విగ్రహానికి పూజ చేశారు. అయితే ఆ విగ్రహం ఏసుక్రీస్తు లాగా తయారు చేశారని ఆ రాష్ట్ర అఖిల భారత విద్యార్థి విభాగ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం విగ్రహానికి చీర కట్టించిందని అసహనం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సంస్కృతి, మత సంప్రదాయలాలను దెబ్బతీసే విధంగా ఉందని ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిబాకర్ ఆచార్జీ అన్నారు. కాలేజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం మాణిక్ సాహా డిమాండ్ చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. హిందువుల సెంటిమెంట్ ని కించపరిచేలా వల్గర్ గా ఈ చర్య ఉందని వారు మండిపడ్డారు.