త్రిపురలో 40మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

త్రిపురలో 40మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 60 స్థానాలకు ఎన్నికలకు జరుగుతుండగా... అందులో 48 స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. మిగిలిన 12మంది అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కాగా సీఎం మాణిక్ సాహా టౌన్ బోర్దోవాలి నుంచి, కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్ ధన్‌పూర్ నుంచి, ఎండీ మోబోషర్ అలీ కైలాషహర్ నుంచి, రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజీబ్ భట్టాచార్జీ బనమాలిపూర్ నుంచి పోటీ చేయనున్నారు.

త్రిపుర ఎన్నికల షెడ్యూల్‌లో మార్పు లేదు: సీఈవో

జనవరి 18న ఎన్నికల సంఘం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించింది. అయితే షెడ్యూల్ మారుతుందన్న వార్తలపై ఎన్నికల సంఘం తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఎన్నిక తేదీల్లో ఎలాంటి మార్పు లేదని ఎన్నికల ప్రధాన అధికారి గిట్టే కిరణ్‌కుమార్ దినకరరావు  తెలిపారు. 60 సీట్లకు త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 16న ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది.