
దుబాయ్: తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిష, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఐసీసీ మంత్లీ అవార్డు రేసులో నిలిచారు. జనవరి నెలకుగానూ ఈ ఇద్దర్ని నామినేట్ అయ్యారు. విమెన్స్ అండర్–19 టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ పెర్ఫార్మెన్స్ చూపెట్టిన త్రిష.. టోర్నీ చరిత్రలో తొలి సెంచరీ సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. మొత్తం 309 రన్స్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచింది.
త్రిష సూపర్ షోతో ఇండియా రెండోసారి వరల్డ్ కప్‌ను సాధించింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ 14 వికెట్లు తీశాడు. దీంతో ఇండియా 4–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. విండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్, పాక్ బౌలర్ నోమన్ అలీ కూడా ఈ అవార్డు రేస్‌లో ఉన్నారు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వారికన్ 19, నోమన్ అలీ 16 వికెట్లు పడగొట్టారు.