హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వెయిట్ చేస్తున్నా: త్రిష

హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వెయిట్ చేస్తున్నా: త్రిష

హీరోయిన్‌ త్రిష పెళ్లి విషయంలో గతంలో ఎన్నోసార్లు పుకార్లు రావడం,  అవన్నీ అవాస్తవాలని తేలడం తెలిసిందే. తాజాగా తన పెళ్లికి సంబంధించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.  చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి జరగబోతోందని, ఇందుకు ఇరుకుటుంబాలు ఇప్పటికే అంగీకారం తెలిపారనేది ఆ వార్త సారాంశం.  

ఈ క్రమంలో త్రిష తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది.  ‘‘నా కోసం నా జీవితాన్ని ప్లాన్‌ చేస్తున్న వాళ్లను నేను ప్రేమిస్తా.. నా హనీమూన్‌ షెడ్యూల్‌ కూడా వాళ్లే చెబుతారేమోనని వేచి  చూస్తున్నా” అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ చేసింది. 

తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఇలా వ్యంగ్యంగా ఖండించింది త్రిష.  2015లో వరుణ్ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో ఆమె నిశ్చితార్థం జరిగినప్పటికీ, అభిప్రాయ భేదాలతో దాన్ని రద్దు చేసుకున్నారు. తర్వాత కెరీర్‌‌ పై ఫోకస్ పెట్టిన త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది.  ప్రస్తుతం తెలుగులో ‘విశ్వంభర’,  తమిళంలో ‘కరుప్పు’ చిత్రాల్లో ఆమె నటిస్తోంది.