వీరభద్రుడి సన్నిధిలో త్రిశూల స్నానం

వీరభద్రుడి సన్నిధిలో త్రిశూల స్నానం

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం త్రిశూల స్నానం నిర్వహించారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వీరశైవ భక్తులు, భంగి మఠం అర్చకులు, వీరముష్టివారు పల్లేరులు మోసుకుంటూ వేద మంత్రోచ్ఛరణల నడుమ శైవ సంప్రదాయం ప్రకారం కోనేటిలో త్రిశూలార్చన నిర్వహించారు.

వీరభద్ర స్వామి ఉగ్రతత్త్వం, శక్తి స్వరూపాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో కిషన్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ బొజ్జపురి అశోక్‌ ముఖర్జీ, సీఐ పులి రమేశ్, ఎస్సై ఎన్‌.రాజు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కొలుగురి రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు రాజయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.