పోక్సో కేసులో 3 ఏళ్ల జైలుశిక్ష

పోక్సో కేసులో 3 ఏళ్ల జైలుశిక్ష

సిద్దిపేట రూరల్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధించినట్లు త్రీటౌన్ సీఐ భాను ప్రకాశ్ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన మండల రాయులు(70) 2021 జూన్ 12 న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ విషయంపై అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో అడిషనల్ డిస్టిక్ సెషన్స్ కోర్టు జడ్జి శిక్ష విధించినట్లు తెలిపారు.