అప్పుడు అత్త కోసం.. ఇప్పుడు అమ్మానాన్నల కోసం.. ఏంటి భయ్యా ఇది?

అప్పుడు అత్త కోసం.. ఇప్పుడు అమ్మానాన్నల కోసం.. ఏంటి భయ్యా ఇది?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబోలో ముచ్చటాగా మూడోసారి వస్తున్న మూవీ గుంటూరు కారం(Guntur kaaram). ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

అయితే తాజాగా ఈ సినిమా కథ గురించి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ విడిపోయిన తన అమ్మానాన్నలను కలిపేందుకు ప్రయత్నిస్తుంటాడట. ఇందుకోసమే ఫారన్ నుండి ఇండియా కు వస్తాడట మహేష్. అమరావతికి అటు పక్క ఊళ్ళో అమ్మ, ఇటు పక్కన ఊళ్ళో నాన్న ఉంటారట. అందుకే ఈ సినిమాకు ముందుగా అమరావతికి అటూ ఇటూ అనే టైటిల్ అనుకున్నారు మేకర్స్. కానీ మహేష్ అంటే మాసీగా ఉండాలి కదా అని గుంటూరు కారం ఫిక్స్ చేశారట మేకర్స్.     

ఇక ఈ న్యూస్ చూసిన చాలా మంది నెటిజన్స్.. గుంటూరు కారం సినిమాను అత్తారింటికి దారేది(Atharintiki Daaredi) సినిమాతో పోల్చుతున్నారు. ఆ సినిమాలో అత్త కోసం, ఈ సినిమాలో అమ్మానాన్నల కోసం అంటూ ట్రోల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఇక మారారా. ఎప్పడూ ఏవే కథలా.. తీసినవే ఎన్నిసార్లు తీస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.