తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్

ఇవాళ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నవారిలో.. ఏపీ హైకోర్టు జడ్జి మానవేంద్రనాథ్ రాయ్, తెలంగాణ హైకోర్టు జడ్జి వెంకటేశులు,టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు.