గెలిచే మ్యాచ్ ను పోగొట్టాడంటూ జాదవ్ పై ట్రోలింగ్

గెలిచే మ్యాచ్ ను పోగొట్టాడంటూ జాదవ్ పై ట్రోలింగ్

చెన్నై ప్లేయర్ కేదార్ జాదవ్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 10 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ చెన్నైవిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే. అనూహ్యాంగా ధోనీ, శామ్ కరన్ ఔట్ కావడంతో.. క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ జిడ్డు బ్యాటింగ్ తో గెలిచే మ్యాచ్ ను ఓడిపోవడానికి కారణమయ్యాడంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చెన్నై గెలవడానికి చివరి 4 ఓవర్లలో 44 రన్స్ కావాలి. అప్పటికీ చెన్నై చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. శామ్ కరన్, ధోనీ క్రీజులో ఉన్నారు. ఇంకేం చెన్నై గెలవడం ఈజీ అనుకున్నారంతా.

కానీ.. 16వ ఓవర్ లో ధోనీ ఓటైన తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ జోరు చూపించలేకపోయాడు. కీలమైన దశలో డాట్ బాల్స్ చేస్తూ చెన్నై ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. బౌండరీలు, సిక్సర్లు బాదాల్సిన జాదవ్.. టెస్ట్ మ్యాచ్ లాగా ఢిఫెన్స్ ఆడుతూ.. గెలిచే మ్యాచ్ ను చేతులారా పోగొట్టాడు. లాస్ట్ ఓవర్ కు 26 రన్స్ కావడంతో జడేజా రెచ్చిపోయినా ఫలితం లేకుండా పోయింది. ఫస్ట్ 10 ఓవర్ల జోరుచూస్తే చెన్నై 2 ఓవర్లు మిగిలుండగానే 168 టార్గెట్ ను ఫినిష్ చేసేలా కనిపించినా.. చివరకు 10 రన్స్ తేడాతో ఓడిపోయిందంటూ విమర్శిస్తున్నారు. దోంతో కేదార్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు.