వీడియో: ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన జవాన్లు

వీడియో: ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన జవాన్లు

ఛత్తీస్‌గఢ్: దంతెవాడ జిల్లా కట్టెకళ్యాణ్ పోలీసు స్టేషన్ పరిధిలోని జియోకొర్తా-డోగోరిపారా వెళ్ళే అటవీప్రాంతంలో 3 కిలోల ఐఈడీ బాంబులను జవాన్లు గుర్తించి నిర్వీర్యం చేశారు. దాంతో స్థానిక పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. నీలవాయి అటవీప్రాంతంలో శుక్రవారం జవాన్లు ఐదుకిలోల శక్తివంతమైన ఐఈడీ బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ మరుసటి రోజే శనివారం ఉదయం మరో 3 కిలోల ఐఈడీ బాంబులను ప్రత్యేక బలగాలు గుర్తించాయి. జిల్లాలోని డోగిరిపారా మార్గంలోని తెలంటెటమ్ అటవీప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్ళే జవాన్లపై దాడే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులను అమర్చారు. తాజాగా తెలంటెటమ్ గ్రామం వద్ద అధికారులు పోలీసు క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రారంభం చేయనున్న నేపథ్యంలో ప్రత్యేక బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలు బాంబులను గుర్తించి సురక్షితంగా వెలికి తీసి నిర్వీర్యం చేసినట్లు పోలీసులు తెలిపారు.

For More News..

కరోనా పేషంట్ బాడీలో 105 రోజులు ఎలాంటి లక్షణాలు లేకుండా సజీవంగా ఉన్న వైరస్

రాష్ట్రంలో కొత్తగా 1,607 కరోనా కేసులు

సైబర్ మీడియా రీసెర్చ్ : చిన్నా పెద్దా అందరూ మొబైల్ గేమ్స్ లోనే..