
- ఉద్యోగులను ఆకర్షించేందుకు స్టార్టప్‌ల తంటాలు
- బోనస్‌లు, లీవ్‌లు, ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు..
- ఉద్యోగులు జాయిన్ కావడం లేదని వాపోతున్న స్టార్టప్‌లు
బిజినెస్ డెస్క్, వెలుగు: ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులను ఆకర్షించడానికి స్టార్టప్ కంపెనీలు మరిన్ని బెనిఫిట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అన్‌లిమిటెడ్ లీవ్‌లు, బోనస్‌లు, ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్లు అంటూ ఉద్యోగులను ఊరిస్తున్నాయి. స్టార్టప్‌ల సెగ్మెంట్‌లో హైరింగ్ ప్రాసెస్‌లో కాంపిటేషన్ పెరిగిందని ఈ కంపెనీలు చెబుతున్నాయి. క్యాండిడేట్లు జాబ్ మానేయడం, కౌంటర్ ఆఫర్లు పెరుగుతుండడం, స్కిల్ ఉన్న వారు తక్కువగా ఉండడం వంటి కారణాలతో స్టార్టప్‌లు కొత్త ఉద్యోగులను ఆకర్షించాలనుకుంటున్నాయి. ఉన్న ఉద్యోగులను నిలుపుకోవాలనుకుంటున్నాయి. మీషో, ఫోన్‌పే, అప్‌గ్రేడ్, పర్పల్, ప్రిస్టిన్ కేర్, స్పిన్నీ వంటి యూనికార్న్‌లు ఉద్యోగులకు జెండర్‌తో సంబంధం లేకుండా పేరెంట్ లీవ్‌లు, మెంటల్ హెల్త్ బ్రేక్‌లు, పర్మినెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఆఫర్ చేయడం, నెలవారీగా ప్రోత్సాహకాలను ఇస్తుండడం, ఉద్యోగుల వర్క్‌ను బట్టి రివార్డ్‌లను అందించడం వంటివి చేస్తున్నాయి. స్టార్టప్ కంపెనీ హెడ్అవుట్ పేరెంట్ లీవ్స్, పీరియడ్ లీవ్స్, మెంటల్ హెల్త్ లీవ్స్ వంటివి ఇస్తోంది.
టాలెంట్ ఉన్న ఉద్యోగులు దొరకడం కష్టమవుతోంది..
గత నాలుగు నెలల్లో మొత్తం 40 మందికి జాబ్ ఆఫర్స్ ఇచ్చామని, ఎవరూ జాయిన్ అవ్వలేదని లాంగ్‌హౌస్ కన్సల్టింగ్ కంపెనీ సీఈఓ అనుసుమన్ దాస్ అన్నారు. బోనస్‌లు, ఈసాప్‌లు, బైబ్యాక్‌లు, నోటిస్ పీరియడ్ బోనస్‌లు వంటివి ముందు నుంచే ఉన్నాయని, కానీ స్టార్టప్‌లు వీటిని ఇప్పుడు ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయని చెప్పారు. ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులను నిలుపుకునేందుకు అన్ని విధాలాప్రయత్నిస్తున్నాయని అన్నారు. కరోనాకు ముందు యూనికార్న్‌లు జాబ్ ఆఫర్ చేసిన 100 మందిలో 50–60 మంది జాయిన్ అయ్యేవారని, ప్రస్తుతం ఈ రేటు 20–30 కి తగ్గిందని లాంగ్‌హౌస్ కన్సల్టింగ్ అంచనా వేసింది. కొన్ని పరిస్థితుల్లో ఈ నెంబర్ 10–15 శాతానికి కూడా తగ్గుతోందని పేర్కొంది. జాబ్స్‌లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్న వాళ్లలో కూడా సగం మందే చేరుతున్నారని వివరించింది. కరోనా ముందు ఈ నెంబర్ 70–80 శాతంగా వరకు ఉంది. ఈ–కామర్స్ కంపెనీ మీషో ఉద్యోగులందరికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఆఫర్ చేసింది. యూజ్డ్ కార్‌లను అమ్మే స్పిన్నీ, ఉద్యోగి ఫ్యామిలీ పిల్లలను అడాప్ట్ చేసుకుంటే రూ. 35 వేల వరకు ఇస్తోంది. ప్రిస్టీన్ కేర్ ఉద్యోగులకు ఫ్రీ మీల్స్, ఫ్రీ పార్కింగ్, ఇండోర్ గేమ్ జోన్ వంటివి అందిస్తోంది.