టీఆర్ఎస్, ఎంఐఎం చరిత్రను వక్రీకరిస్తున్నయ్

టీఆర్ఎస్, ఎంఐఎం చరిత్రను వక్రీకరిస్తున్నయ్

హైదరాబాద్: టీఆర్ఎస్, ఎంఐఎం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ పోరాటంతోనే సెప్టెంబర్ 17ను చేయడానికి అందరూ ముందుకొచ్చారన్నారు. విమోచన వేడుకలే వద్దన్న కేసీఆర్ మావల్లే దిగొచ్చాడని తెలిపిన బండి సంజయ్.. దారుస్సాలం నుంచి ఆదేశాలు రాగానే టీఆర్ఎస్ అమలు చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించిందని.. టీఆర్ఎస్, ఎంఐఎం ఏం చెబితే కాంగ్రెస్ అదే పాటిస్తుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాదా ఇంకా విమోచన దినోత్సం ఎందుకన్న కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చారన్నారు. అది నోరా తాటి మట్టనా అర్దం కాదని.. చరిత్రను మరిచి మాట్లాడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ అదే మాట మాట్లాడుతుందని..  ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని జరుపాలన్న కేసీఆర్ మాట మార్చారన్నారు. చరిత్రను మరిచి తమకు అనుకూలంగా మార్చుకున్నారని.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఎంఐఎం చెప్పినట్లు వినడం సిగ్గుచేటు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి ఆత్మలు ఘోషించేలా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందుకే కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.