
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ నుంచి సర్టిఫికెట్ ను అందుకున్నారు నవీన్ రావు. ఎమ్మెల్సీ కి దాఖలైన రెండు నామినేషన్లలో..సంతకాలు సరిగా లేక పోవడంతో ఒక నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. దీంతో విత్ డ్రాల్ గడువు ముగిసిపోవడంతో నవీన్ రావు ఎన్నికైనట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. ఏక గ్రీవంగా ఎన్నికైన నవీన్ రావును మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి అభినందించారు.