గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై టీఆర్ఎస్ డైలమా

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై టీఆర్ఎస్ డైలమా

హైదరాబాద్, వెలుగుగ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడంపై టీఆర్ఎస్ డైలమాలో ఉంది. పోటీ చేసి ఓడిపోతే పరవు పోతుందని ఆందోళన చెందుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ రామచందర్ రావు పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తోంది. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీలు సిద్దమవుతున్నాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత  జరిగిన కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు. దీంతో గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ లో పోటీ  చేసేందుకు టీఆర్ఎస్  దైర్యం చేయలేకపోతోందనే చర్చ పార్టీ నేతల మధ్య ఉంది.

తటస్థులకు మద్దతు

ఎన్నికల్లో పోటీ చేయకుండా తటస్థులకు మద్దతిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు  టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. అధికారంలో ఉండి పార్టీ అభ్యర్థులు ఓడిపోతే పరవు పోతుందని అంటున్నారు. అందుకని బలమైన తటస్థుల కోసం అన్వేషణ చేస్తోందనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి టీజేఎస్ తరపున కోదండరాం పోటీ చేయనున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర రావుకు మద్దతిస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోదండరాంపై బలమైన తటస్థ అభ్యర్థి ఎవరనే దానిపై అన్వేషణ జరుగుతోందని ప్రచారం ఉంది.

ప్రణబ్ మంచి దోస్తు..ఆ స్నేహంతోనే తెలంగాణకు సాయం చేసిండు