బీజేపీలోకి కొనసాగుతోన్న వలసల పర్వం

బీజేపీలోకి కొనసాగుతోన్న వలసల పర్వం

తెలంగాణ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ప్రధాని మోడీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్ లు బీజేపీలోకి జాయిన్ అవుతున్నారు. చండూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఇవాళ కమలం తీర్థం పుచ్చుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు.

చొప్పరి వారి గూడెం, ధోనిపాముల, నెర్మట, తుమ్మలపల్లికి చెందిన టీఆర్ఎస్ సర్పంచ్ లు కమలం గూటికి చేరారు. ఉడతల పల్లి, కోటయ్య గూడెం, శిర్ధే పల్లి, గొల్లగూడెంకు చెందిన కాంగ్రెస్ సర్పంచ్ లు, కస్తాల, కొండా పురం ఎంపీటీసీలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడు మండలంలోని చల్మడ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ కూడా బీజేపీలోకి జాయిన్ అయ్యారు. వీరంతా హైదరాబాద్ కు వచ్చి ఈటల రాజేందర్ సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.