పెట్రో రేట్ల పెంపుపై టీఆర్ఎస్ నిరసనలు

పెట్రో  రేట్ల పెంపుపై టీఆర్ఎస్ నిరసనలు

ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేరోజులు దగ్గర పడ్డాయన్నారు..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పెరిగిన పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో, గ్యాస్ ధరలు పెంచారని మండిపడ్డారు.  పెరిగిన పెట్రో, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా.. బేగంపేట ప్రధాన చీఫ్ రేషనింగ్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు.

గ్యాస్ సిలిండర్ పై భారాన్ని కేంద్రం తగ్గించాలని డిమాండ్ చేశారు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత. గ్యాస్ సిలిండర్ 400 రూపాయాలకే ఇవ్వాలన్నారు. పెరిగిన భారాన్ని కేంద్రమే భరించాలన్నారు. బండి సంజయ్ కు దమ్ముంటే కేంద్రం నుంచి సిలిండర్ పై తెలంగాణకు సబ్సిడీ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించాలన్నారు. 

మరిన్ని వార్తల కోసం

నువ్వా–నేనా!: అంబానీ–అదానీల మధ్య ముదురుతున్న పోటీ

ప్రాణాలకు తెగించి యువకుడిని రక్షించిన పోలీసు