కరీంనగర్ అదనపు కలెక్టర్ కు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదు

కరీంనగర్ అదనపు కలెక్టర్ కు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదు

మ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ కరీంనగర్ 49వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ కు ఫిర్యాదు చేశారు. ఈ మధ్యే కౌన్సిల్ సమావేశంలో ఖాళీ బిందెతో నిరసన తెలిపిన కౌర్.. తాజాగా ఆమె తన భర్తతో వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ డివిజన్ లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైపులైను నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని కోరారు. 

కౌన్సిల్ మీటింగ్ లో తాను ఖాళీ బిందెతో నిరసన తెలపడంపై మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ ను కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ ఖండించారు. తన డివిజన్ లో సమస్య ఉంది కాబట్టే నిరసన తెలిపానని, ఒకవేళ తమ డివిజనల్ లో సమస్య లేదని మంత్రి కేటీఆర్ నిరూపిస్తే టీఆర్ఎస్ పార్టీకి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఇవాళ ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, ఒకవేళ తాగునీటి సమస్య పరిష్కారం కాకపోతే హెచ్ఆర్ సీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర!

కరాటే కళ్యాణికి నోటీసులు..స్పందించకుంటే చర్యలే