బయ్యారం ఉక్కు కోసం టీఆర్‌ఎస్ దీక్ష ప్రారంభం

బయ్యారం ఉక్కు కోసం టీఆర్‌ఎస్ దీక్ష ప్రారంభం

మహబూబాబాద్ : బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్ష ప్రారంభమైంది. టీఆర్ఎస్ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడంతో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, రాములు నాయక్ నిరసన దీక్షకు దిగారు. ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. విభజన చట్టంలోని హామీల ప్రకారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కేంద్ర బృందాలు పలుమార్లు సర్వే చేశాయి. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇనుప రాయి గుట్ట, నీటి లభ్యత, రైల్వేలైన్, విద్యుత్ సదుపాయం తదితర అంశాలను పరిశీలించాయి. సర్వేల అనంతరం ఇనుపరాయి నాణ్యత సరిగా లేదంటూ.. కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం చేతులెత్తేసింది. బయ్యారం ఉక్కు పరిశ్రమ రాదంటూ తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు నిరసన దీక్షకు దిగారు.

మరిన్ని వార్తల కోసం..

మీ పిల్లలకు మార్కులు కావాలంటే.. ఓటేయండి

ఖమ్మం ఆర్టీసీ డిపోల్లో డీజిల్ లేక అవస్థలు