వడ్లు కొనకుంటే బీజేపీకి నూకలు చెల్లినట్టే

వడ్లు కొనకుంటే బీజేపీకి నూకలు చెల్లినట్టే

కరీంనగర్/వరంగల్: తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని, కానీ కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. వడ్లు కొనకుండా తప్పించుకోవాలని చూస్తే రాష్ట్రంలో బీజేపీకి పూర్తిగా నూకలు చెల్లినట్లేనని మంత్రి గంగుల హెచ్చరించారు. 

యాసంగి వడ్లను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్‌‌ఎస్ పార్టీ ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా  కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ దగ్గర జరిగిన ధర్నాలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణను కేంద్ర అవమానిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనడం సరికాదని అన్నారు. మనల్ని నూకల తినమని చెప్పిన బీజేపీ నాయకులతోనే నూకలు తినిపిద్దామని అన్నారు. తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని చెప్పారు. కేంద్రం దిగి వచ్చే వరకూ తమ పోరాటం ఆగబోదని గంగుల స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిపై ఈ నెల 8న నల్లజెండాలు పెట్టుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేయాలని చెప్పారు. 

నిజామాబాద్‌లో ప్రశాంత్ రెడ్డి, వరంగల్‌లో ఎర్రబెల్లి.. 

వడ్ల కొనుగోలు విధానంపై కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్‌‌ఎస్ చేపడుతున్న ధర్నాల్లో వరంగంల్ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వడ్లు పూర్తిగా కొనుగోలు చేసే  వరకూ ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఈ నెల 11న ఢిల్లీలో భారీ స్థాయిలో ధర్నా చేస్తామన్నారు.

మరిన్ని వార్తల కోసం..

డ్రగ్స్ కేసు నిందితులు చంచల్ గూడ జైలుకు తరలింపు

త్రివిక్రమ్ శ్రీనివాస్కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్ 

నీలోఫర్‌‌లో మూడ్రోజుల పసికందును వదిలేసిన్రు