
మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే అక్కడ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగసభను నిర్వహించిన టీఆర్ఎస్.. ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం ప్రారంభించింది.
చౌటుప్పల్ మండలం కేంద్రంలో కేసీఆర్ ఫొటోతో , కారు బొమ్మతో ఉన్న గోడ గడియారాలను ఇంటింటికీ పంపిణీ చేసిన టీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు కొత్తగా గొడుగులను పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సాధారణంగా నోటిఫికేషన్ వెలువడ్డాక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేపట్టే ఈ తాయిలాల పంపిణీని మునుగోడులో టీఆర్‌ఎస్ అప్పుడే మొదలుపెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి.