తెలంగాణ యువత విశ్వాసం.. విషాదంగా మారింది : హరగోపాల్

తెలంగాణ యువత విశ్వాసం.. విషాదంగా మారింది  : హరగోపాల్

తెలంగాణ ఉద్యమసమయంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సభలో ఆయన పాల్గోన్నారు.  ఉద్యమపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ యువత విశ్వాసం.. విషాదంగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల నిర్బంధాలు కొనసాగడం సరికాదన్నారు.  

మునుగోడులో కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేసిన 10వేల ఓట్లతో మాత్రమే గెలిచారని హరగోపాల్ విమర్శించారు. రెండు సార్లు గెలిపించిన యువతే.. ఇప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా మారారన్నారు. పరిశ్రమలు వస్తున్నాయని చెబుతున్నారని.. కానీ ఉద్యోగాల కల్పన ఎందుకు పెరగడం లేదన్నారు. ప్రజలు కన్ఫూజన్ లో ఉన్నారని..రాహుల్ గాంధీని కలిసిన సమయంలో అన్నారని వివరించారు. 

ఉద్యోగాల భర్తీలో తెలంగాణ వెనుకబడింది : పీఎల్ విశ్వేశ్వర్ రావు

ఉద్యోగాల భర్తీలో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడిందని పీఎల్ విశ్వేశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదువుల చదివిన చాలామంది ఉద్యోగాలు లేక.. వారి వయస్సు దాటిపోతోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పీహెచ్ డీలు చేసినా ఉద్యోగాలు రావడం లేదన్నారు. లైబ్రరీల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతూ కాలం గడుపుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాష్ట్రం రాలేదన్నారు. విద్యార్థులు ముందుండి ఉద్యమం చేసి, ప్రాణాలు అర్పిస్తేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు.