
మంత్రి హరీష్ రావు డబ్బులతో ప్రలోభ పెట్టి ఇతర పార్టీల నేతల్ని టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. అందుకు నిదర్శనం ఆ పార్టీ లో చేరిన ఒక వ్యక్తి మాట్లాడిన మాటలేనన్నారు.అంతేకాదు బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే దుబ్బాక లో సబ్ స్టేషన్ వచ్చింన్న ప్రేమేందర్ రెడ్డి..హరీష్ రావు తామే ఇచ్చామని చెప్పుకుంటున్నారని తెలిపారు. లుచ్చా లపంగా మాటలు మాట్లాడేది హరీష్ రావు,TRS నేతలేనని..మీ చర్యలు చూస్తేనే దుబ్బాకలో మీ పతనం ప్రారంభం అయిందని స్పష్టం అవుతోందన్నారు. పోలీస్ వహనాల్లోనే డబ్బులు తరలిస్తూ..వారి సాయంతో గెలవాలని అనుకుంటున్నారన్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలకు కారణం కేసీఆర్ సెక్రటేరియట్ లో నల్లపోచమ్మ దేవాలయాన్ని తొలగించడమేనన్నారు ప్రేమేందర్ రెడ్డి. అమ్మవారు జోస్యం, భవిష్య వాణి కూడా చెప్పారన్నారు. గంగమ్మ వస్తుంది.. అంత కొట్టుకు పోతుందని. గ్రామ దేవతలను కదిలించిన ఎవరు పైకి రాలేదని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. వెంటనే అధికారులను పంట నష్టం అంచనాకు పంపించాలి డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు.
6 వేల కొనుగోలు కేంద్రాలు ఏవి…
మక్కలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు ప్రేమేందర్ రెడ్డి. నాఫెడ్ కొనేందుకు సిద్ధంగా ఉందని..మక్కల కొనుగోలు విషయంలో పెద్ద కుంభకోణం ఉందన్నారు. హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయని కేసీఆర్ స్పందించారని…గ్రామాల్లో ఎన్నికలు లేవని రైతులను గాలికి వదిలిశారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం బృందాలు పంపించి నష్ట అంచనా వేసి కేంద్రానికి పంపిస్తే కేంద్ర బృందం వస్తుంది. అయితే కేసీఆర్ మాత్రం..రాజకీయంగా బ్లేమ్ చేయడానికి మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో పసల్ భీమా అమలు చేస్తే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు కదా అని ప్రశ్నించారు ప్రేమేందర్ రెడ్డి.