పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్ ఇచ్చిన టీఆర్ఎస్

పేరు మార్పుపై పబ్లిక్ నోటీస్ ఇచ్చిన టీఆర్ఎస్

పేరు మార్పునకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అభ్యంతరాలుంటే నెల రోజుల్లోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు తెలపాలని ఈ పబ్లిక్ నోటీస్ లో పేర్కొంది. పార్టీ ప్రెసిడెంట్‌ పేరుతో ఈ ప్రకటన వెలువడింది. 

ఈ ఏడాది అక్టోబర్ 5 దసరా పండుగ రోజున టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేశామని స్పష్టం చేసింది. పార్టీ పేరు మార్పునకు సంబంధించిన సమాచారాన్ని కొన్ని రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ రాజ్యాంగంలో చేసిన సవరణలకు జనరల్ బాడీ సమావేశం ఆమోదం తెలిపింది.