గన్ పార్క్ దగ్గర టీఆర్ఎస్ సంబరాలు

గన్ పార్క్ దగ్గర టీఆర్ఎస్ సంబరాలు

TRS ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర సంబరాలు జరిగాయి. కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన పలువురు నేతలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ పై హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్క పధకం కూడా బీజేపీ తీసుకురాలేదన్నారు. మత కలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. ఇప్పటికే లక్షా 33 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 

ఇప్పుడు మరో 91 వేల ఉద్యోగాల ప్రకటన చేసిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేట్ ఇండస్ట్రీలో కేటీఆర్ చొరవతో 15 లక్షల ఉద్యోగాలు ఇప్పించారన్నారు. ప్రతీ ఏడాది నియమకాలుంటాయని సీఎం చెప్పారన్నారు. యువతకు మంచి చేయాలని కేసీఆర్ కి ఉందన్నారు. దేశాన్ని బాగు చేయాలంటే కేసీఆర్ వల్లనే అవుతుందన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి:

అధికారంలోకొస్తే పంజాబ్కు పూర్వవైభవం

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు