రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు అనంతరం ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో  రేపు ఐదు రాష్ట్రాల్లో లిక్కర్ షాపులు మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. 

ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. 40స్థానాలున్న గోవా, ఉత్తరాఖండ్లోని 70 నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగగా.. పంజాబ్లో 117 సీట్లకు ఫిబ్రవరి 20న ఓటింగ్ నిర్వహించారు. ఇక మణిపూర్ లోని 60 సీట్లకు ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నిక జరిగింది.

ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్లో బీజేపీ బీజేపీ మరోసారి అధికారం చేపట్టనుంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్, గోవాల్లో మాత్రం పోటాపోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

సీఎం ప్రకటన తీవ్ర నిరాశకు గురి చేసింది

కేసీఆర్‌కు థాంక్స్ చెప్పిన మంత్రి సబితా