
గజ్వేల్, వెలుగు : గజ్వేల్ దేశంలోనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, కేసీఆర్ అడ్డాలో ఆయనపై పోటీకి సై అంటున్న ఈటలకు భంగపాటు తప్పదని గజ్వేల్ టీఆర్ఎస్ లీడర్లు అన్నారు. ఆదివారం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్‌కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజ్వేల్ టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ లో కాదు మరోసారి హుజూరాబాద్ లో గెలిచి ఉనికి చాటుకోవాలని ఈటలకు సవాల్ విసిరారు. ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీ కండువా వేసుకొని ఈటల డ్రామాలు ఆడుతున్నారన్నారు. హూజూరాబాద్లో ఓటమి భయం పట్టుకోవడంతో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ లీడర్లు పాల్గొన్నారు.